ఝార్ఖండ్ చాయ్బాసాలో తలసీమియాతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు HIV సోకడం కలకలం సృష్టిస్తోంది. స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియాతో బాధపడుతున్న తమ ఏడేళ్ల కుమారుడికి HIV సోకిందని ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం జరిపిన విచారణలో మరో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి.