కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్‌ను పే కమిషన్ ఛైర్మన్‌గా నియమించింది. 18 నెలల్లో సిఫారసులు ఇవ్వాలని పే కమిషన్ ప్యానెల్‌ను ఆదేశించింది.