HYD: జేఎన్టీయూలో ఈనెల 28వ తేదీన బీ ఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు JNTUH అడ్మిషన్స్ డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. జేఎన్టీయూ సుల్తాన్ పూర్, జేఎన్టీయూ హైదరాబాద్లో సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు JNTUH వెబ్సైట్ను సందర్శించాలన్నారు.