SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు నిమ్మల సత్యం(50) తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. వారం రోజుల కిందట పైరును కోసి స్థానిక కొనుగోలు కేంద్రానికి తరలించాడు. శనివారం ధాన్యం ఆరబోస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే ఉన్న రైతులు చేరుకోవడతో అప్పటికే ప్రాణం వదిలాడు.