కృష్ణా: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.వందన అన్నారు. నందిగామ 16వ అదనపు న్యాయమూర్తి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆమె శనివారం నందిగామ సబ్ జైలును సందర్శించారు. జైలు పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ఖైదీల వివరాలు, వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.