GNTR: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ప్రజలు ఆ రోజు కార్యాలయానికి రావద్దని అధికారులు కోరారు. తెనాలి డివిజన్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.