KMM: కూసుమంచి మండలం ముత్యాలగూడెం, నేలపట్ల గ్రామాలలో రైతులకు మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్న సాగు చేసే రైతులు తప్పనిసరిగా సంబంధిత కంపెనీల ఏజెంట్ల నుండి అగ్రిమెంట్ తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రదేశాల నుండి వచ్చిన ఆర్గనైజర్లు, ఏజెంట్ల ద్వారా విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు.