VZM: ఈనెల 28, 29న తుఫాన్ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని, నష్ట నివారణకు రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని మండల ప్రత్యేకాధికారి జి.మురళీనాథ్ కోరారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో 28, 29న విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులను అప్రమత్తం చెయాలన్నారు.