HYD: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సెప్టెంబర్ 2న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు సంబంధించి, వాటిపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరుతూ.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయించారు.