MBNR: కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామ పరిధిలో ఊక చెట్టు వాగు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలో నిరంతరంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు పర్యావరణానికి, భూగర్భ జలాలకు నష్టం కలిగిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.