E.G: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 26 నుంచి 29వరకు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల భద్రత కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మీనా ప్రకటించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరం లేని సమయాల్లో ఇళ్ల బయటకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 9494060060కు సమాచారం ఇవ్వాలని కోరారు.