సౌతాఫ్రికాతో జరిగిన మహిళల ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకుంది. కేవలం 98 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా గ్రూప్ టాపర్‌గా లీగ్ దశను ముగించింది. 7 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ అలానా కింగ్‌కు ‘MOM’ అవార్డు లభించింది.