PPM: మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08963 796085 అని చెప్పారు. ఏమైనా అవసరం ఉంటే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరుకి ఫోన్ చేస్తే, వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.