WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని శనివారం TUCI ఆధ్వర్యంలో కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.