VZM: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైసీపీ నాయకులు వ్యతిరేకించాలని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈనెల 28 న ఎస్ కోటలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి కొత్తవలస ఆయన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించి, పోస్టర్ ఆవిష్కరించారు.