CTR: రానున్న మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ఎస్పీ తుషార్ డూడీతో కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగిందని, అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.