KDP: ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సంస్థాగత అవగాహన విస్తృత సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే మన ప్రభుత్వంలో మీకు పూర్తిగా న్యాయం చేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు