ATP: గుంతకల్లు పట్టణంలోని ధోనిముక్కల కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం డివైఎఫ్ఐ, కాలనీవాసులు విద్యుత్ ఏఈ నాగేంద్రకు వినతిపత్రం అందజేశారు. డివైఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడుతూ.. కాలనీలో విద్యుత్ స్తంభాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి సమయాలలో విష సర్పాలతో ప్రజలు భయాందోళన గురవుతున్నారన్నారు.