HYD: నాగుల చవితి సందర్భంగా ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శ్రీ శివాలయం ఆవరణలో గల నాగదేవతల ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి, నాగదేవతలకు, జంట నాగులకు పాలతో అభిషేకం చేశారు. పాము పుట్టలో పాలు పోసి, పుట్టపై పసుపు కుంకుమలను చల్లారు. పువ్వులతో, పత్తి వస్త్రంతో అలంకరించి, దీప ధూపాలని వెలిగించి, నైవేద్యం సమర్పించారు.