NLR: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న వైసీపీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు MLC పర్వత్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ను సిటీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేట్ పరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. అందరం ఒక్కటై ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు.