PPM: గ్రామంలోని ప్రతి ఒక్కరూ మలేరియా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని మలేరియా రహిత సమాజం కోసం సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది కోరారు. మలేరియాపై ప్రతి గ్రామంలో అవగాహన ముఖ్యమని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. మా ఊరికి మలేరియా వచ్చింది అవగాహన కార్యక్రమం గోరిడి గ్రామంలో కలెక్టర్ ఆద్వర్యంలో శనివారం నిర్వహించారు.