TPT: చంద్రగిరి మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా రోడ్డు కోతకు గురి అయింది. సంబంధిత రోడ్డును శనివారం ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కోతకు గురైనట్లు తెలిపారు. అక్కడ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.