ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో విఫలమైనప్పటికీ, రెండో వన్డేలో 73 పరుగులతో రాణించాడు. ఇక చివరి వన్డేలో సూపర్ సెంచరీ(121*) సాధించి జట్టును గెలిపించాడు. దీంతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. కాగా, ఈ సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది.