MBNR: రాష్ట్రంలోని మత్స్యకారులకు మంచి రోజులు రాబోతున్నాయని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. MBNR మండలంలోని కోడూరు మైసమ్మ చెరువు దగ్గర చేపలు పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. మైసమ్మ చెరువులో చేపలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని చెరువులలో పెంచే చేపలకు మంచి గిరాకీ ఉంటుందన్నారు.