SRCL: జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కొనియాడారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్‌ను పలువురు దివ్యాంగులు శనివారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు.