తిరుపతి: స్వర్ణముఖి నదిలో గల్లంతైన నలుగురు యువకుల కథ విషాదంగా ముగిసింది. శుక్రవారం ఒకరి మృతదేహం లభించగా శనివారం మిగిలిన ముగ్గురి మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. తమ బతుకుల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తే, చీకట్లో నింపేసి వెళ్లిపోయారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.