PLD: గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో, గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించకుండా చర్యలు చేపట్టాలని వినుకొండ ఎమ్మెల్యే జీ.వీ. ఆంజనేయులు అధికారులను కోరారు. ఇందుకుగాను ఎంపీడీవోలతో శనివారం సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు.