ASR: ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ను శనివారం పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు గురించి ఎస్సై రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. కేసులు త్వరగా పరిష్కరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు.