బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సతీష్ షా(74) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాసవిడిచారు. కాగా, సతీష్ షా.. ‘జానేబీ దో యారో’, ‘మై హూనా’ తదితర చిత్రాలతో పాటు ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ వంటి TV షోలతో అలరించారు.