E.G: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం సాయంత్రం తెలిపారు. సోమవారం రోజున నిర్వహించాల్సిన ‘పీజీఆర్ఎస్ – మీ కోసం’ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇంటర్మీడియట్ కళాశాలల నిర్వహణపై స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.