AKP: కోటవురట్ల మండలం బీకే పల్లి సచివాలయాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడుగురు సిబ్బందిలో ఇద్దరు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.