VZM: PGRSను కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో ఈనెల 27న, నిర్వహించనున్నట్లు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో ప్రజలు దీనికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.