VZM: నాగులచవితి సందర్బంగా కొత్తవలస పాత రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో శనివారం ప్రత్యేక భజనలు నిర్వహించారు. భజనలకు సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయి కీర్తనలు ఆలపించారు. సాయి మందిరం సమీపంలో ఉన్న భక్తులు వచ్చి, సత్యసాయిని దర్శించుకున్నారు. భజనలు ఆనంతరం వచ్చిన సాయి భక్తులకు ప్రసాద వితరణ చేసారు.