BDK: మణుగూరు మండలం అనంతారం, చిన్నరాయి గూడెం, ముత్తయ్య గుంపు, మూడు సొసైటీ ర్యాంపుల మధ్య శనివారం ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. మా ర్యాంపు బౌండరీ నుంచి రోడ్డు వెయ్యొద్దు అంటూ జేసీబీలను సొసైటీ సభ్యులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ సర్ది చెప్పి పంపినట్లు తెలిపారు.