PPM: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి ఆదేశించారు. శనివారం ఆమె ఛాంబరులో అధికారులతో సమీక్షించారు. మండల తహసీల్దార్లు, విఆర్ఓలు, సిబ్బంది ప్రధాన కేంద్రాలలో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలు ఇబ్బందులు లేకుండా ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.