ELR: విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు ఆత్మస్థైర్యం, పోరాట ప్రతిమ అవసరమని ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏఎస్పీ శక్తి యా`పై అవగాహన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. విద్యార్థులు ప్రతి అంశంలోనూ ధైర్యంతో వ్యవహరించాలన్నారు. శక్తి యాప్ను వినియోగించడం ద్వారా ఆపదలో ఉన్నప్పుడు క్షణాల్లో పోలీసుల నుంచి సహాయం అందుతుందన్నారు.