NZB: ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నవీపేట్ మండలం యంచలో గోదావరి వరద ముంపు బాధితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ.. ఎమ్మార్వోలు తప్పుడు లెక్కలు రాసి నివేదికలు పంపారని ఆరోపించారు.