HNK: పరకాల పట్టణంలోని సబ్ జైలును జువేనైల్ బోర్డు సభ్యులు సుభాష్, రమణమూర్తి శనివారం సందర్శించారు. జైలు పరిసరాలు పరిశీలించి, ఖైదీల వివరాలు, 18 ఏళ్ల లోపు బాలలు ఉన్నారా అని ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఖైదీలు శిక్షా కాలంలో సత్ప్రవర్తన చెంది, బయటకు వెళ్ళాక గౌరవప్రద జీవితం గడపాలని సూచించారు. కార్యక్రమంలో జైలు సూపరిండెంట్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.