KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో, ఎంపీ నిధుల నుంచి వేయించిన బోరుబావిని మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. రోగుల అవసరం మేరకు బోర్ వేయించిన బండి సంజయ్కు మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.