ASR: సమ్మె విరమించిన పీహెచ్‌సీల వైద్యులు సోమవారం పాడేరు డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి రిపోర్టు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి శనివారం తెలిపారు. తుఫాను నేపథ్యంలో 64 పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. గర్భిణులను బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు తరలించాలన్నారు.