GDWL: ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద కొంతమేర తగ్గి, శనివారం రాత్రి నాటికి ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులుగా నమోదైంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్ట్ నుంచి 22,680 క్యూసెక్కుల నీటిని, కుడి ప్రధాన కాలువకు 600 క్యూసెక్కులు కలిపి మొత్తంగా 23,327 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, నెట్టెంపాడు ఎడమ కాలువ, నీటి విడుదలను నిలిపివేశారు.