JN: రాయపర్తి రైతు వేదికలో హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లు, ఐకెపీ మహిళలకు వరి కోతలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కునమల్ల అనురాధ హాజరై మాట్లాడుతూ.. పూర్తిగా పక్వానికి వచ్చిన తరువాతనే వరి కోతలు ప్రారంభించాలని, హార్వెస్టర్ ఆర్పీఎం 18–20 లోపు ఉంచాలని సూచించారు. మాయిశ్చర్ రోజూ చెక్ చేయాలని సూచించారు.