SRD: కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన కస్ప సంతోష్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కంగ్జి సీఐ వెంకటరెడ్డి శనివారం తెలిపారు. రెండు నెలల క్రితం కల్హేర్లో అతని మేన మామ వద్ద ఉంటూ ఓ బాలికను ఎత్తుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.