NZB: వ్యభిచార దందా నిర్వహిస్తున్న తమను పట్టించాడని పగ పెంచుకున్న కొందరు ఓ వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు బాధితుడు శనివారం నందిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది జనవరిలో నందిపేట మండలం లక్కంపల్లి శివారు ప్రాంతంలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో నిర్వాహకులతో పాటు విటులను పట్టుకున్నారు.