GNTR: రానున్న మూడు రోజులు మెంథా తుపాను దృష్ట్యా, సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని, అధికారులకు సహకరించాలని ఆమె కోరారు.