కృష్ణా: మొంథా తుఫాన్ కారణంగా ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఇప్పటికే వెళ్లినవారు ఈరోజు సాయంత్రంలోగా తిరిగి ఇంటికి చేరుకోవాలన్నారు. అధికారుల అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.