AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘రెవెన్యూ, పోలీస్, NDRF బృందాలు అప్రమత్తంగా ఉండాలి. రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాం. లోతట్టు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలి. తుఫాన్ తీరం దాటే వరకు సహాయక చర్యలు పర్యవేక్షించాలి’ అంటూ అధికారులకు సూచించారు.