NZB: నవంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే పౌర హక్కుల సంఘం మూడో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్గోట్ రవీందర్ ఆదివారం పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌లో మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిద్దాం జీవించే హక్కును కాపాడుకుందాం అంశంపై బహిరంగ సభ జరుగుతుందని రవీందర్ తెలిపారు.