SRD: అమీన్పూర్ మండలం TSUTF నూతన కమిటీ కార్యవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడుగా కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, పద్మావతి, ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి నవీన్ కాంత్, కార్యదర్శులుగా మధులత, సరళ దేవి, తిరుపతిరావు ఎన్నికయ్యారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు కృష్ణంరాజు తెలిపారు.