KRNL: తుగ్గలి మండలం రాతన గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి, అందిస్తున్న ఆహార నాణ్యత, పాఠశాల సౌకర్యాలు, పాఠశాల హాజరు వంటి అంశాలను వివరంగా ఆరా తీశారు. ఆహారం రుచి చూసి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. ఆమె వెంట పలు అధికారులు ఉన్నారు.